స్టేజ్‌పై పాట పాడి మెప్పించిన ధ‌నుష్

by samatah |   ( Updated:2023-02-09 17:07:37.0  )
స్టేజ్‌పై పాట పాడి మెప్పించిన ధ‌నుష్
X

దిశ, సినిమా: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం 'సార్'. తమిళంలో 'వాతి'గా తెరకెక్కిన సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలకానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఏ.ఎమ్.బీ సినిమాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక రిలీజైన ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగానే హీరో ధనుష్ చిత్రంలోని 'మాస్టరు మాస్టరు' అనే హిట్ సాంగ్‌ను స్టేజ్‌పై పాడి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story