Dhanush 'Rayan': సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ ‘రాయన్’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

by sudharani |
Dhanush Rayan: సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ ‘రాయన్’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘రాయన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో రానుంది. ఇక ఇందులో ధనుష్‌తో పాటు హీరో సందీప్ కిషన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది.

ఈ మేరకు తాజాగా ‘రాయన్’ కు సంబంధించిన తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిన్న చిన్న కట్స్‌తో సెన్సార్ టీమ్ ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా ఇందులో హింసను ప్రేరేపించే విధంగా కొన్ని సీన్స్ ఉండటంతో పాటు రక్తం, ఘర్షణలు వంటి దృశ్యాలు ఎక్కువగా ఉండటంతో అలాంటి వాటిని తొలగించాలని సూచించింది. ఇక ‘A’ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న కారణంగా 18 లోపు వయసు గల వారికి ఈ సినిమాని ప్రదర్శంచడం నిషేదం. కాగా.. కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకోవడంతో సెన్సార్ సభ్యులు ‘రాయన్’ మూవీ టీమ్‌కు అభినందనలు కూడా తెలియజేసినట్లు తెలుస్తుంది.

Read more...

Dhanush: అదొక బ్లెస్సింగ్.. ‘రాయన్’ మూవీపై ధనుష్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed