- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద విద్యార్థుల చదువు కోసమే మా 'సార్' పోరాటం: మేకర్స్
దిశ, సినిమా: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త జంటగా తెరకెక్కిన చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ధనుష్.. 'ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. మొదటి తెలుగు సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. కథ చాలా బాగుంటుంది. నాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలతోపాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు' అని తెలిపాడు. ఇక చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై కథానాయకుడు సాగించే పోరాటమే ఈ 'సార్' అని చెప్పిన దర్శకుడు వెంకీ.. తమ సినిమాను ఆదరించి బిగ్ హిట్ అందివ్వాలని కోరాడు. హైపర్ ఆది కీలకపాత్రలో కనిపించనున్న చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
ఇవి కూడా చదవండి: