NTR-Janhvi Kapoor: విడుదలకు ముందే అదరగొడుతున్న ‘దేవర’.. ఊహకందని రేంజ్‌లో ప్రీ సేల్స్

by Hamsa |
NTR-Janhvi Kapoor: విడుదలకు ముందే అదరగొడుతున్న ‘దేవర’.. ఊహకందని రేంజ్‌లో ప్రీ సేల్స్
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య విడుద‌లైన ఫియ‌ర్ సాంగ్, చుట్ట‌మ‌ల్లే.. , దావుడి సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకునేలా చేశాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ప్ర‌త్యాంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవ‌రూ చేయ‌నంత గొప్ప‌గా రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తోంది. రీసెంట్‌గానే ప్రీ బుకింగ్స్‌ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్ప‌టికే ప్రీ సేల్స్ ఊహించని విధంగా ఐదు ల‌క్ష‌ల డాల‌ర్స్‌ను దాటేయ‌డం విశేషం. సినిమాపై ఉన్న బ‌జ్‌, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌టం లేదు. అయితే తొందరలోనే ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story