NTR: ఊరమాస్ యాక్షన్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘దేవర’ రిలీజ్ ట్రైలర్..

by Hamsa |
NTR: ఊరమాస్ యాక్షన్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘దేవర’ రిలీజ్ ట్రైలర్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కింది. అయితే ఇందులో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, దేవర రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను రెట్టింపు చేశారు. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్, ఊరమాస్ యాక్షన్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ప్రజెంట్ దేవర రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఆవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed