‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేదప్పుడే.. నెట్టింట వైరలవుతోన్న ప్లేస్, డేట్, గెస్ట్

by Anjali |   ( Updated:2024-09-14 14:18:53.0  )
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేదప్పుడే..  నెట్టింట వైరలవుతోన్న ప్లేస్, డేట్, గెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న దేవర పార్ట్-1 సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ వెయింగ్ మామూలుగా లేదనుకోండి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇటీవలే అదిరిపోయే ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్‌లో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన మూడు పాటలు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా గడిపేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా నిర్వహించి.. పలు ఇంటర్వ్యూలు కూడా చేశారు.

తెలుగులో మాత్రం దేవర చిత్ర ప్రమోషన్స్ చాలా తక్కువగా నడుస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల (సెప్టెంబరు) 22 న ఘనంగా నిర్వహించనున్నారట. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ మూవీస్ లాగే ఓపెన్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట దేవర చిత్ర యూనిట్. అలాగే నెటిజన్లకు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఎంటంటే? సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వస్తున్నారట. ఇక గతంలో సూపర్ స్టార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ హాజరైన విషయం తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ.. మహేష్ ను ఆహ్వానించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed