Demonte Colony: ఆ హారర్ మూవీకి సీక్వెల్ 3 కూడా ఉంది.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by sudharani |
Demonte Colony: ఆ హారర్ మూవీకి సీక్వెల్ 3 కూడా ఉంది.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీమోంటీ కాలనీ 2’. జ్ఞానముత్తు పట్టరై, వైట్‌నైట్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 15న రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ఈ నెల 23న తెలుగులోగ్రాండ్ రిలీజ్‌కు ఉన్న ఈ చిత్రం సీక్వెల్ 3పై కూడా సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు మేకర్స్. ‘డెమోంటీ కాలనీ 2’ను తెలుగులో పాపులర్ ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. రిలీజ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ మీట్‌లో ‘ఈ చిత్రానికి థర్డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ డెమోంటీ కాలనీ 3 కూడా వచ్చేస్తుంది. ఈ మూడో పార్ట్‌ 2026లో విడుదల కానుంది’ అంటూ చెప్పుకొచ్చారు చిత్ర బృందం. కాగా.. ‘డిమోంటీ కాలనీ 2’ రిలీజ్‌కు ముందే పార్ట్ 3 రిలీజ్ సమయంతో సహా చెప్పడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisement

Next Story