Deepika Padukone: ఆస్కార్‌కు బాలీవుడ్ నటి దీపిక

by Prasanna |   ( Updated:2023-03-03 09:19:50.0  )
Deepika Padukone: ఆస్కార్‌కు బాలీవుడ్ నటి దీపిక
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపిక పదుకొణె మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. మార్చి 12న జరిగే 95వ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్‌గా దీపికకు వెల్‌కమ్ చెప్తూ... ఆస్కార్ నిర్వాహకులు పంపిన ఇన్విటేషన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీపిక మురిసిపోతోంది. ఇక దీపికతో పాటు ఈ ఈవెంట్‌లో రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, జెన్నిఫర్ కొన్నెల్లీ, అరియానా డీ బోస్, శామ్యూల్ ఎల్ జాక్సన్, డ్వానే జాన్సన్, మైఖెల్ బి జోర్డాన్, ట్రాయ్ కోట్సుర్, జొనాటన్ మేజర్స్, మెలిస్సా మెక్ కార్తీ, జనెల్లే మోనాయ్, క్వెస్ట్‌లోవ్, జాయ్ సాల్దానా, డొన్ని యెన్ వంటి ప్రముఖులు సందడి చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : నేను వర్జిన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Advertisement

Next Story