బేబీ బంప్‌తో దీపిక పదుకొణె పోస్ట్.. భర్త రియాక్షన్ ఏంటంటే?

by sudharani |
బేబీ బంప్‌తో దీపిక పదుకొణె పోస్ట్.. భర్త రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ దీపిక పదుకొణె. త్వరలో తల్లి కాబోతున్న ఈ అమ్మడు ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూనే.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా రిలీజైన ‘కల్కి 2898AD’లో కూడా నటించి ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ రిలీజ్‌కు ముందు ప్రెగ్నెంట్ అయినప్పటికీ ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటూ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా.. ఇన్‌స్టా వేదికగా ప్రేక్షులకు, అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది దీపిక. ఈ మేరకు ‘పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను!! అందుకే ఇలా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఈ పోస్ట్‌పై దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ.. ‘నా అందమైన పుట్టినరోజు బహుమతి! నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చాడు.

Advertisement

Next Story