సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం.. పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరం: CPI Narayana

by Prasad Jukanti |   ( Updated:2024-10-05 10:22:52.0  )
సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం.. పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరం: CPI Narayana
X

దిశ, డైనమిక్ బ్యూరో: జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ స్పందించారు. జైలు మాన్యువల్స్ లో క్యాస్ట్ కాలమ్ ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశిస్తూ చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెజింగ్ పనులు, అగ్రకులాల వారికి వంట పనులు కేటాయింపు వివక్షే అవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ స్వాగతిస్తున్నదన్నారు. ఈ తీర్పు ఓ మైలురాయి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. రాజ్యాంగం ముందు ప్రజలంతా సమానమే అయినప్పటికీ సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల అనేక జైళ్లు వివక్షను పాటిస్తున్నాయని సీజేఐ గమనించారన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఎపిసోడ్ వ్యవహారం దర్యాప్తునకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడాన్ని నారాయణ మరొక ప్రకటన ద్వారా స్వాగతించారు. అలాగే తిరుమల లడ్డూ అంశం సందర్భంగా పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం దురదృష్టకరం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed