- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
3.23 కేజీల గంజాయి పట్టివేత
దిశ, జూబ్లీహిల్స్ : గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం, వరంగల్, చిట్యాల తదితర ప్రాంతాలకు చెందిన దుగ్యాల రాజ్ కుమార్, పథ వర్షిత్, గుండెపూడి సూర్య అజయ్, తుమ్మా భానుతేజారెడ్డి, దండి దీపక్ అనే ఐదుగురు స్నేహితులు కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 సీబీఐ కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ అధికారులు సీఐ వాసుదేవరావు , ఎస్ఐ బ్రహ్మచారి, శ్రీనివాస్ బృందం హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
దాంతో వీరి వద్ద 3.23 కేజీల గంజాయి దొరికింది. దుగ్యాల రాజ్ కుమార్, పథ వర్షిత్, గుండెపూడి సూర్యఅజయ్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, తుమ్మా భానుతేజారెడ్డి, దండి దీపక్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు, 3.23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
- Tags
- ganja