- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Formula E-Car Racing: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ (KTR)ను ఆరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ఏసీబీ (ACB) అధికారులు ఈ నెల 27న ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ ( Counter Petition) దాఖలు చేశారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో A1గా ఉన్న కేటీఆర్ (KTR), రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government) ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసులో విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, కేటీఆర్‌పై ఏసీబీ పెట్టిన కేసులను కోర్టు కొట్టివేస్తుందా.. విచారణను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే మరి.