Sunrise: ఈ సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు పోటెత్తిన ప్రజలు

by Mahesh |
Sunrise: ఈ సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు పోటెత్తిన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 క్యాలెండర్ ఇయర్ నేటితో ముగిసిపోనుంది. రేపటి నుంచి 2025 కొత్త సంవత్సరం(new year) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరంలో చివరి సూర్యోదయం(Sunrise)ను చూసేందుకు ప్రజలు, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు గోవా(GOA) తీరంకు పోటెత్తారు. డోనా పౌలా ప్రాంతంలోని బీచ్ సమీపంలో సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకున్న ప్రజలు.. ఈ సంవత్సరంలో చివరి సూర్యోదయాన్ని తమ ఫోన్లలో బంధించేందుకు.. పోటి పడ్డారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయింది. ప్రజల కేరింతల మధ్య.. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడు సముద్రం మధ్యనుంచి భయటకు వస్తున్నట్లుగా.. సూర్యోదయం జరిగింది. దీంతో ఆ సన్నివేశాన్ని తిలకించిన పర్యావరణ ప్రేమికులు.. కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఈ సంవత్సరంలో ఇదే చివరి సన్ రైజ్.. చూసి తరించండంటూ షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed