Srinivas Goud: నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు.. టీటీడీ సిఫార్సు లేఖలపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్

by Shiva |
Srinivas Goud: నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు.. టీటీడీ సిఫార్సు లేఖలపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సిఫార్సు లేఖలపై తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల (Tirumala)లో తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదని అన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడనని క్లారిటీ ఇచ్చారు. తిరుమల క్షేత్రంలో అందరినీ సమానంగా చూడాలని ఆయన అన్నారు.

కాగా, టీటీడీ బోర్డు(TTD Board) తిరుమలలో తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల (Telangana Public Representatives) లేఖలపై శ్రీవారి దర్శనానికి అనుతించాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఫైలుపై సంతకం చేశారు. దీంతో కొత్త సంవత్సరం నుంచి తిరుమల తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై వారానికి నాలుగు సార్లు దర్శించుకోవచ్చు. ఇందులో వారానికి రెండుసార్లు బ్రేక్ దర్శనం, అలాగే మరో రెండు సార్లు రూ.300 దర్శనాలు చేసుకునేందుకు టీటీడీ (TTD) వీలు కల్పించింది.

Advertisement

Next Story

Most Viewed