అరుదైన వైరస్ బారినపడ్డ సీత.. కష్టంగా ఉందంటోంది

by samatah |
అరుదైన వైరస్ బారినపడ్డ సీత.. కష్టంగా ఉందంటోంది
X

దిశ, సినిమా :ప్రముఖ నటి డెబీనా బొనర్జీ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. హిందీ సీరియల్‌ ‘రామాయణం’లో సీతగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇటీవలే ‘ఇన్‌ఫ్లూఎంజా బి’ (influenza B) అనే అరుదైన వైరస్ బారినపడ్డట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ‘శ్రీలంక వెకేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తీవ్రత పెరిగింది. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాను. కొన్ని మెడికల్ టెస్ట్‌లు సూచించారు. ఈ వ్యాధి సోకినవారు కుటుంబానికి ముఖ్యంగా చిన్నపిల్లలకు దూరంగా ఉండాలన్నారు. నా పసి పిల్లలిద్దరనీ వదిలి అస్సలు ఉండలేని పరిస్థితి. ఇది చాలా కఠిన పరీక్ష. అయినప్పటికీ వారి ఆరోగ్యం దృష్ట్యా తప్పదు’ అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆమెకు సానుభూతిని ప్రకటిస్తూనే మనోధైర్యాన్ని ఇస్తూ మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed