ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by sudharani |   ( Updated:2023-04-16 07:04:56.0  )
ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘దసరా’. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపుగా రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు టాక్.

ఇక థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వారికి ఓ శుభవార్త అందింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ ‘దసరా’ సినిమాను మే 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా.. దసరా హిందీ వెర్షన్ రైట్స్‌ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.

Advertisement

Next Story