Darling movie OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న డార్లింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

by Hamsa |
Darling movie OTT: మరికొన్ని గంటల్లో  స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న డార్లింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్, బలగం హీరో ప్రియదర్శి జంటగా నటించిన సినిమా ‘డార్లింగ్’. బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ జూలై 19న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే డార్లింగ్ విడుదలకు ముందే వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చిత్రంపై హైప్‌ను పెంచాయి. ముఖ్యంగా నభా, ప్రియదర్శి జంటగా చేసిన కామెడీ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, డార్లింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. దీని ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే డార్లింగ్ చిత్రం మరికొన్ని గంటల్లో (ఆగస్టు 13) మంగళవారం నుంచి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసి సినీ ప్రియుల ఆనందానికి కారణమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed