- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెగా బిజినెస్ పై విమర్శలు!.. లావణ్య త్రిపాఠిని ఏకిపారేస్తున్న జనం..అసలు ఏమైందంటే?
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. కాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించి గత సంవత్సరమే పెళ్లి చేసుకున్నది. ఇక అప్పటి నుంచి మెగా కోడలు స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ.
అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ చేసిన పని విమర్శలకు దారి తీస్తోంది. అసలు విషయానికి వస్తే ఈ మధ్యనే చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన కలిసి అత్తమ్మ కిచెన్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిజినెస్ కోసం ఉపాసన కొణిదెల గత కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రాంలో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్‌ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అంజనమ్మ, సురేఖమ్మ అత్తమ్మాస్ కిచెన్ కోసం ప్రొడక్టులు తయారు చేస్తూ ఉంటే.. ఉపాసన వాటిని ఫోటోలు, వీడియోలు తీసి, వారితో ఫన్నీగా ముచ్చట్లు పెడుతూ.. ఆ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా అత్తమ్మాస్ కిచెన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ అమ్మ పద్మ ఆవకాయ్‌ను తయారు చేస్తూ కనిపించారు. అయితే ఇద్దరూ కూడా ఆవకాయను కలిపేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోవడంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. అంతేకాక అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్‌ల నాణ్యత మీద కంప్లైంట్ ఇస్తున్నారు. అలా జుట్టుని వదిలేసి ఆవకాయ కలుపుతున్నారు.. చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. కొంచెం కూడా హైజీన్‌గా మెయింటైన్ చేయడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ టీం డైరెక్ట్ గా రంగంలోకి దిగి మరి ఈ కామెంట్లకు రిప్లై ఇచ్చింది. అది అమ్మడానికి చేస్తున్న ఆవకాయ్ కాదు.. మా ఇంటి కోసం చేసింది కాబట్టి.. వాళ్లు అలా కనిపించారు.. అని చెప్పుకొచ్చింది.