- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిమినల్ జస్టిస్.. న్యాయం కాదు సంపాదనే పరమావధిగా లాయర్స్
దిశ, ఫీచర్స్ : పోలీసుల ఓవర్ ఇమాజినేషన్, నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని పిల్లాడిని కోర్టులో దోషిగా నిలబెట్టింది. మీడియా, పబ్లిక్ ట్రయల్స్ మానసికంగా కుంగిపోతున్న అతడిని షార్ట్ టెంపర్‌గా చిత్రీకరించాయి. కేసులో ఎలాగైనా నెగ్గాలనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తపన.. ఆ పసివాడు తప్పుచేయకపోయినా సరే నేరస్తుడిగా రుజువుచేయాలనే కసిని పెంచాయి. తెలిసీతెలియని వయసులో సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ జీవితాన్ని బలితీసుకుంటే.. ప్రతీకారం మరో ప్రాణమేనా? ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్న నకిలీ ఎకౌంట్స్‌కు.. నిజజీవితాలకు సంబంధం లేనట్లేనా? పదేళ్లు కూడా దాటని పిల్లలు యూత్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మైనర్స్ కూడా డ్రగ్స్ అందుబాటులో ఎలా ఉంటున్నాయి? అనే కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటున్న సిరీస్ 'క్రిమినల్ జస్టిస్ 2'. నెగెటివ్ జడ్జ్‌మెంట్స్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తూ.. ప్రస్తుత సమాజంలో నెలకొన్న తీవ్రమైన సమస్యను హైలెట్ చేసింది.
స్టోరీ..
ఓ సీరియల్ ద్వారా పదేళ్లకే పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు పొందిన 'జారా అహుజా' తండ్రి.. తల్లిదండ్రులు విడిపోవడంతో కుమిలిపోయి డ్రగ్స్‌కు బానిసైన మైనర్ 'ముకుల్ ఆహుజా' తల్లి.. ఇద్దరు రెండో పెళ్లి చేసుకుంటారు. పేరుకు స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్ అయినప్పటికీ.. పిల్లలను మాత్రం కన్నవారిలాగే చూసుకుంటుంటారు. కానీ అప్పటికే మానసికంగా కుంగిపోతున్న ముకుల్.. స్టార్‌గా అవతరించిన 'జారా' ముందు పనికిరానివాడిగా తనను తానే చిత్రీకరించుకుంటూ కోపం పెంచుకుంటాడు. చాన్స్ దొరికితే చంపాలనే కసి పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా 'జారా' హత్యకు గురికావడం.. ఆ సమయంలో ఆమె ముకుల్ దగ్గరే ఉండటం, ముకుల్ తీసుకున్న డ్రగ్ శాంపిల్స్ జారా బాడీలో దొరకడంతో పోలీసులు తూతూ మంత్రంగా విచారణ చేసి అతడిని కస్టడీలోకి తీసుకుంటారు.
జారా సెలబ్రిటీ కావడంతో మీడియాలో కేసు గురించి 24గంటలు ప్రసారం కావడం.. కోర్టుకు హాజరుకాకముందే, తీర్పురాకముందే అతడిని దోషిగా చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో జారా తండ్రి.. ముకుల్ నిజంగానే తన కూతురిని హత్య చేశాడనే నిర్ధారణకు రాగా ముకుల్ తల్లి మాత్రం కొడుకును ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోరాడుతుంది. ఇందుకోసం లాయర్ మాధవ్ మిశ్రా(పంకజ్ త్రిపాఠి)ను సంప్రదిస్తుంది. మరోవైపు ఫెమినిస్ట్ అయిన లాయర్ లేఖ (శ్వేతా బసు ప్రసాద్) ముకుల్‌కు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని ప్లాన్స్ వేస్తుంది. ఈ క్రమంలో ఓ వైపు కోర్టు డ్రామా ఆసక్తికరంగా సాగుతుండగా.. మరోవైపు జువైనల్ హోంలో ముకుల్‌ను తన మేట్స్ చేసే వేధింపులు తట్టుకోలేకపోతుంటాడు. చివరికి అనుకోకుండా జారా మర్డర్‌కు కారణం సంబంధం లేని వ్యక్తి అని నిర్ధారణ అవుతుంది. ఇందుకు సోషల్ మీడియా కారణంగా మారుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో ఏం జరిగింది? ముకుల్ ఆహుజా కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అనేది కథ.
ప్లస్ పాయింట్స్
* సమాజంలో పోలీసుల తీరు, న్యాయవాదుల విధానాలు తెరకెక్కించిన విధానం
* ప్రజెంట్ సొసైటీలో భార్యాభర్తలు విడిపోతే పిల్లలపై పడుతున్న మానసిక ప్రభావం
* చిన్నతనంలోనే డైజెస్ట్ చేసుకోలేని సంఘటనలు ఎదురుకావడంతో డ్రగ్స్‌కు బానిసవుతున్న పిల్లలు
* స్టార్‌డమ్ దక్కడంతో ఎవరినీ లెక్కచేయని విధంగా మారుతున్న చిల్డ్రెన్
* ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలనే అంశం
* సోషల్ మీడియా ఫేక్ ఎకౌంట్స్, ట్రోలింగ్స్ అండ్ ఎఫెక్ట్స్
ఇవి కూడా చదవండి : న్యూయార్క్‌లో దీపావళి సెలవులు.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్