రవితేజ75 పై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే?

by sudharani |   ( Updated:2024-10-02 14:55:41.0  )
రవితేజ75 పై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే?
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత రవితేజ లిస్ట్‌లో ఉన్న చిత్రం ‘RT75’. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ కాగా.. పూజాకార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇటీవల ఈ మూవీ షూటింగ్ సమయంలో రవితేజ భుజానికి గాయం కాగా.. డాక్టర్లు సర్జరీ చేశారు.

ఈ కారణంగా ‘RT75’ తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ఫ్యాన్స్ త్రీవ నిరుత్సాహానికి గురయ్యారు. మళ్లీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌కు ఓ గూడ్ న్యూస్ అందిందని చెప్పొచ్చు. ఈ మేరకు ఫిలిమ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘RT 75’ కొత్త షెడ్యూల్‌ అక్టోబర్ 14 నుంచి స్టా్ర్ట్ కానుందని సమాచారం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రవితేజ ఈ తేదీ నుంచే షూట్‌లో చేరబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్‌. అంతేకాకుండా అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.

Advertisement

Next Story