Unstoppable-2: పవన్-బాలయ్య ఎపిసోడ్‌ అప్‌డేట్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-01-21 14:02:56.0  )
Unstoppable-2: పవన్-బాలయ్య ఎపిసోడ్‌ అప్‌డేట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు 'ఆహా' బృందం శుభవార్త చెప్పింది. బాలయ్య హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్‌-2లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ అతి త్వరలో రాబోతోందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పవన్-బాలయ్యకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ''అన్‌స్టాపబుల్‌-2లో పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.. పవర్ తుపాన్ లోడింగ్‌'' అంటూ నెట్టింట్లో పోస్టు పెట్టారు. దీనిని పవన్, బాలయ్య అభిమానులు ట్వీట్లు, రీట్వీట్లతో ట్రెండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలను ఒకే వేదికపై చూడటానికి ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ బుల్లితెర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ రచ్చ చేస్తున్నారు.

Read more:

ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్

Advertisement

Next Story