Pawan Kalyan ‘OG’ గ్లింప్స్‌ కట్‌పై క్రేజీ టాక్ !

by Anjali |   ( Updated:2023-08-23 17:41:16.0  )
Pawan Kalyan ‘OG’ గ్లింప్స్‌ కట్‌పై క్రేజీ టాక్ !
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్‌లో ‘OG’ ఒకటి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఓ భారీ ట్రీట్‌ని ప్లాన్ చేసినట్లు తెలిసింది. అదేంటంటే.. ఈ మూవీ నుంచి గ్లింప్స్ రావచ్చునని తెలుస్తోంది. అంతే కాకుండా వీడియో బ్యాక్ గ్రౌండ్‌కి మేకర్స్ కోలీవుడ్ యువ నటుడు అర్జున్‌ దాస్ వాయిస్ ఓవర్‌ని పెట్టారట. ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ అర్జున్ వాయిస్‌కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో అందరికీ తెలిసిందే. కాబట్టి అతని వాయిస్ ఓవర్‌లో వచ్చే గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి :

Pawan Kalyan ఫ్యాన్స్ అలర్ట్.. పుట్టినరోజున ఫుల్ మీల్స్ ఖాయం!

పవన్ కల్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ పై నెటిజన్ విమర్శ.. రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే?

Advertisement

Next Story