ఎన్టీఆర్‌-చంద్రబాబును కలవడానికి నా పట్టీలు, గోల్డ్ కమ్మలు అమ్మేశా.. నిహారిక సంచలన కామెంట్స్

by Anjali |
ఎన్టీఆర్‌-చంద్రబాబును కలవడానికి నా పట్టీలు, గోల్డ్ కమ్మలు అమ్మేశా.. నిహారిక సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సాధారణంగా అభిమానానికి హద్దులు ఉండవు. ఇక సెలబ్రిటీల ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పలు హీరోలకైతే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో మూవీ విడుదలవుతుందంటే చాలు థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తారు. కొంతమంది తమ ఫేవరెట్ హీరోలకు, హీరోయిన్లకు గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి (ఉదా: రియల్ హీరో సోనూసూద్, టాలీవుడ్ హీరోయిన్ సమంత). మరికొంతమంది తమ అభిమాన సెలబ్రిటీల బర్త్ డే నాడు అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం చేయడం, గుండెలపై వారి ఫొటోలను టాటూగా వేయించుకోవడం లాంటివి చేస్తారు.

ఇలాంటి ఓ డై హార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ కోసం తమ పట్టీలనే అమ్మేసింది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి. తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘‘నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. మా నాన్న హాస్టల్ లో ఫీ సరిగ్గా కట్టలేదు. స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ ఇస్తామని ప్రకటన చేశారు. కానీ చదువుకు కావాల్సిన ఫీజు తెచ్చుకోవాలన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన ‘సాంబ’ చిత్రం రిలీజ్ అయింది. ఆ హీరోపై ఉన్న అభిమానంతో ఎలాగైనా ఎన్టీఆర్ ను కలవాలని నా పట్టీలు, కమ్మలు అమ్మేసి హైదరాబాదుకు వచ్చాను.

ఎన్టీఆర్ ఆఫీసుకు వెళ్లాను. కానీ సాంబ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన డిప్రెషన్ లో ఉన్నారని, ఇండస్ట్రీ మంచిది కాదమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. అప్పుడు నా వయస్సు 15 ఏళ్లు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాను. వారి వాచ్ మెన్ నన్ను గేటు కూడా దాటనివ్వలేదు. అనంతరం చంద్రబాబుని కలవాలని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లాను. అక్కడ 7 డేస్ ఉన్నాను. చంద్రబాబు నా వాక్చాతుర్యం చూసి జెమిని టీవీలో రిఫర్ చేయడంతో నాకు జాబ్ వచ్చింది. కానీ పలు కారణాల వల్ల నేను అందులో జాయిన్ అవ్వలేదు’’. అంటూ నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed