Yadama Raju-స్టెల్లా విడాకులు.. అసలు విషయం ఏంటంటే..?

by sudharani |   ( Updated:2023-06-28 14:00:44.0  )
Yadama Raju-స్టెల్లా విడాకులు.. అసలు విషయం ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న యాదమరాజు.. స్టెల్లా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట.. తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లై ఏడాది కూడా కాలేదు అప్పుడే విడాకులేంటీ అంటూ పలువురు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే.. ఈ మధ్యనే ఓ డాన్స్ షోకు హాజరైన ఈ జంట తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశారు.

ఇంతకి విషయమేంటంటే.. బుల్లితెర కాడెడీ షోలో ప్రతి వారం ఓ వెరైటీ థీమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు కమెడియన్లు. ఈ క్రమంలో ఈ వారం యాదమరాజు-స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఓ స్కిట్ వేస్తున్నారు. దీంట్లో భాగంగానే.. ‘నీతో నా వల్ల కావడం లేదు.. నాకు విడాకులు కావాలి’ అంటూ స్టెల్లా అడుగుతోంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్‌లా జరగాలని చెబుతుంది. అయితే ఇందంతా ప్రమోషన్స్ స్టంట్ అని తెలుసుకున్న నెటిజన్లు.. కొత్తగా పెళ్లైన జంటకు విడాకులు ఏంటి.. ఇంతకన్న మంచి ఆలోచనలు రావా మీకు అంటూ మండిపడుతున్నారు. ప్రమోషన్స్ కోసం లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు తెలపడం వీళ్లకు కొత్తేమి కాదంటూ మరికొందరు చీవాట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed