Varun-Samantha: వరుణ్-సమంతల కెమిస్ట్రీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
Varun-Samantha: వరుణ్-సమంతల కెమిస్ట్రీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ ధావన్-సమంత కెమిస్ట్రీపై సిటాడెల్ నిర్మాత గినా గార్డి పొగడ్తల వర్షం కురిపించారు. సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ క్యూట్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ సమంత అండ్ వరుణ్ ధావన్ హీరో-హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సిటాడెల్ ప్రీమియర్ ను లండన్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో సిటాడెల్ ఇటలీ వెర్షన్ యూనిట్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గినా గార్డి మాట్లాడారు. ‘నేను సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కూడా చూశానని వెల్లడించారు. సమంత-వరుణ్ ధావన్ జోడి అద్భుతంగా ఉందని అభివర్ణించారు.

వీరి జోడి బాగా ఆకట్టుకుందని, నేను నిజంగా షాక్ అయ్యానని తెలిపారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మళ్లీ మళ్లీ చూశానని.. వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా అనిపించిందని.. వీరు నటించిన రోల్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని వివరించారు. అలాగే రాజ్ అండ్ డీకేలంటే తనకు ఎంతో అభిమానమని తెలిపారు. వీరు మూవీస్ ఎప్పుడు చూసినా చాలా భిన్నంగా ఉంటాయని అన్నారు. వీరు తెరకెక్కించిన ఏ సినిమాలు అయినా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవుతాయని పొగిడారు. సిటాడెల్ ఈ గ్లోబల్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ను మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed