- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Citadel Teaser: సిటాడెల్ టీజర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్ అదరగొట్టిన సమంత, వరుణ్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత.. గతంలో పెండింగ్ పెట్టిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న వాటిలో ‘‘సిటాడెల్: హనీ-బన్నీ’ ఒకటి. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ పోస్ట్ పెట్టింది. అలాగే ఇందులో నుంచి టీజర్‌కు కూడా రిలీజ్ చేశారు.
ఈ మేరకు ‘మీ అందరి దృష్టి మా సరికొత్త గూఢచారులపైనే’ అనే క్యాప్షన్ ఇచ్చి రిలీజ్ చేసిన టీజర్ ప్రజెంట్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో వరుణ్, సమంతలు కలిసి చేసే యాక్షన్ సీన్స్ టీజర్‌లో ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ‘సిటాడెట్’ సిరీస్‌లో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ సమంత స్వయంగా చేయడంతో.. సిరీస్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.