చిరు నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనే..!

by Shiva |   ( Updated:2023-04-24 11:53:08.0  )
చిరు నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనే..!
X

దిశ, వెబ్ డెస్క్: వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ తన నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారనే దానిపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఆయన బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి పని చేయనున్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు ఫిల్మ్ నగర్ లో షికార్లు కొడుతున్నాయి. అయితే, దర్శకుడి నుంచి కానీ, నటుడి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇంత వరకు వెలువడ లేదు. తాజాగా ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సోషియో ఫాంటసీ చిత్రంగా చెబుతున్న ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ ప్రస్తుతం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ భోళాశంకర్‌ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. చిరంజీవి 156వ చిత్రానికి సర్దార్ దర్శకుడు పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు.

Also Read..

సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. డెరెక్టర్ ఖరారు!

Advertisement

Next Story