నిహారిక, చైతన్య విడాకులు.. రంగంలోకి చిరంజీవి!

by samatah |
నిహారిక, చైతన్య విడాకులు.. రంగంలోకి చిరంజీవి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ విడిపోతున్నారు. ఇక ఈ కోవలో మెగా బ్యూటీ, నిహారిక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా నిహారిక, తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇలా న్యూస్ రావడానికి కూడా కారణం లేకపోలేదు. 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నల గడ్డను, నిహారిక వివాహం చేసుకుంది. కొంతకాలం సంతోషంగా ఉన్న వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు గుస గుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిహారిక చైతన్యను అన్ ఫాలో చేయడం, చైతన్య తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే మెగా ఫ్యామిలీలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా నాగబాబు స్పందిచేవాడు. కానీ ఈ విడాకుల ఇష్యూపై ఆయన స్పందించడం లేదు. దీంతో మెగా అభిమానులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో చిరంజీవి రంగంలోకి దిగి, నిహారిక, చైతన్యకు స్ధి చెప్పనున్నట్లు తెలుస్తుంది. అలాగే చిరంజీవి వీరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నాడంట. మరి చిరంజీవి మాట వింటారో లేదో వేచి చూడాల్సిందే,

Advertisement

Next Story

Most Viewed