చిరంజీవి గన్‌తో వారిని బెదిరించారు.. వైరల్ అవుతున్న హీరోయిన్ సుహాసిని ఆసక్తికర వీడియో

by Hamsa |   ( Updated:2023-11-24 06:51:18.0  )
చిరంజీవి గన్‌తో వారిని బెదిరించారు.. వైరల్ అవుతున్న హీరోయిన్ సుహాసిని ఆసక్తికర వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ తమిళ నటి, ప్రస్తుత బిగ్ బాస్ తమిళ సీజన్ కంటెస్టెంట్ విచిత్ర చేసిన ఆరోపణలు ఎంత సంచలనంగా మారాయో చెప్పాల్సిన పని లేదు. ఇటీవల చాలా మంది ధైర్యంగా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపి ఎమోషనల్ అవుతున్నారు. ఇక విచిత్ర చేసిన కామెంట్స్ బాలయ్యని ఉద్దేశించి అని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమా ఈవెంట్లలో కాస్త చిలిపిగా హీరోయిన్లపై జోకులు వేసిన వీడియోలను పోస్ట్ చేసి ఇదేంటని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా, సీనియర్ హీరోయిన్ సుహాసిని ఒకప్పుడు చిరంజీవిని మెచ్చుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సుహానికి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించేవారు. ఇండస్ట్రీలో తన స్నేహితులైన హీరోలు, హీరోయిన్లతో ముచ్చటించేవారు. ఇలా ఒకరోజు లైవ్ వీడియో చేస్తున్నప్పుడు చిరంజీవికి వీడియో కాల్ చేశారు.

చిరు వీడియో కాల్‌లో ఉండగానే.. ఆయన గురించి ఆడియన్స్‌కి సుహాసిని గొప్పగా చెప్పారు. ‘‘కేరళలోని అథిరపల్లిలో షూటింగ్ చేస్తున్నాం. మీరు ముందు కారులో ఉన్నారు. నేను, నా హెయిర్ డ్రెస్సర్, డాన్స్ మాస్టర్ తార వెనుక కారులో ఉన్నాం. కొంత మంది తాగుబోతులు మా కారును అడ్డుకుని బీరు బాటిళ్లు విసిరారు. అప్పుడు మీరు ఏం చేశారో గుర్తుందా? అని లైవ్‌లో చిరంజీవిని సుహాసిని అడిగారు. నేను నా పిస్టల్ బయటికి తీశాను అని చిరంజీవి చెప్పారు. అది లైసెన్సెడ్ గన్ అని సుహాసిని అన్నారు. తాగుబోతులు సుహాసిని కారు పైకి బీరు బాటిళ్లు విసరడంతో చిరంజీవి వెంటనే గన్ తీసి వారిని బెదిరించారట. చిరంజీవితో పాటు ఉన్న యూనిట్ బాయ్స్ కూడా రంగంలోకి దిగి తాగుబోతులను చితక్కొట్టారట. ఈ విషయాన్ని చిరంజీవి చెప్పగానే.. సుహాసిని మాట్లాడుతూ హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది మాత్రమే కాదు. రియల్ లైఫ్‌లో కూడా మీరు హీరో. ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నా’’ అని చెప్పుకొచ్చిన వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పటికైనా చిరంజీవిని ట్రోల్ చేసే వారు వాటికి చెక్ పెడతారో లెదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed