Chiranjeevi: చిరంజీవిపై చెయ్యి వేసిన యంగ్ హీరో.. తర్వాత జరిగింది చూసి అందరూ షాక్!

by Javid Pasha |
Chiranjeevi: చిరంజీవిపై చెయ్యి వేసిన యంగ్ హీరో.. తర్వాత జరిగింది చూసి అందరూ షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి అంటేనే అదో క్రేజ్. అభిమానులు మొదలు కొని నటీనటుల వరకు ఆయనను చిత్రపరిశ్రమలో పెద్దన్నగా భావిస్తుంటారు. ఇక ఫ్యాన్స్ అయితే ఏ మాత్రం చాన్స్ దొరికినా మెగాస్టార్‌తో ఒక్క ఫొటో అయినా దిగాలని ఆరాట పడుతుంటారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చిరు అభిమానగణం చాలా పెద్దగానే ఉంటుంది. మెగా స్టార్‌కు కూడా తన అభిమానులంటే ఎనలేని ప్రేమ. వారిని ఎంతో గౌరవిస్తారు. ఎవరినీ హర్ట్ చేయరు. తాజాగా అలాంటి ఓ సిచ్యువేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసినా చిరు అభిమానులు సంతోషంగా పొంగిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి టాక్ సొంతం చేసుకున్నది. చిరంజీవి కూడా చూసి బాగుందని మెచ్చుకోవడంతోపాటు ఆ మూవీ టీమ్‌ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే.. కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సభ్యులంతా చిరంజీవితో ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరోల్లో ఒకరైన యశ్వంత్ మెగాస్టార్ కోసం తెచ్చిన కానుకన ఇచ్చి ఫొటో దిగే క్రమంలో చిరు వీపుపై చెయ్యి వేశాడు. ఇది గమనించిన చిరంజీవి అసిస్టెంట్ వెంటనే ఆ యంగ్ హీరో చెయ్యి తీసి వేశాడు.

కాగా వెంటనే కంగారు పడ్డ ఆ హీరో దూరంగా జరిగిపోయాడు. అక్కడున్నవారంత ఇది చూసి ఏం జరుగుతోంది అన్నట్లు ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే తేరుకున్న చిరంజీవి వాళ్లు అలాగే అంటారు. నువ్వు చెయ్యి వేసుకో పర్లేదు అంటూ కమిటీ కుర్రోళ్లు మూవీ హీరో యశ్వంత్ చేయిని లాక్కుని తన వీపైపు వేసుకున్నాడు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. చిరంజీవి చేసిన పనికి అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా మెగాస్టార్ మంచి మనస్సు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Video Credits to Harish R.menon X Id

Advertisement

Next Story

Most Viewed