చిరుకి ప్యూర్ ఎమోషనల్ మూమెంట్.. చెర్రీ డాక్టరేట్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Sujitha Rachapalli |
చిరుకి ప్యూర్ ఎమోషనల్ మూమెంట్.. చెర్రీ డాక్టరేట్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ.. తాజాగా డాక్టరేట్ అందుకుని మెగాస్టార్ చిరంజీవి ఆనందభాష్పాలు పెట్టుకునేలా చేశాడు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ తాజాగా రామ్ చరణ్ ను గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది. సినీరంగానికి చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు ప్రౌడ్ ఫాదర్ గా పోస్ట్ పెట్టాడు. 'చెర్రీ డాక్టరేట్ అందుకోవడంతో ఎమోషనల్ అయిపోయాను. ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఏ పేరెంట్ కు అయినా ట్రూ హ్యాపీనెస్ తమకంటే తమ పిల్లలు మరింత ఎక్కువగా అచీవ్ చేయడమే. నా కొడుకు అది చేసి చూపిస్తున్నాడు. లవ్ యూ మై డియర్ Dr. Ram Charan' అని మురిసిపోయాడు.


Advertisement

Next Story