'వాల్తేరు వీరయ్య'.. సమిష్టి కృషితోనే గొప్ప విజయం సాధించింది: Chiru

by srinivas |   ( Updated:2023-01-17 10:31:23.0  )
వాల్తేరు వీరయ్య.. సమిష్టి కృషితోనే గొప్ప విజయం సాధించింది: Chiru
X

దిశ, సినిమా: చిరంజీవి, రవితేజ, బాబీ కలయికలో వచ్చిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన మూవీ జనవరి 13న విడుదలై భారీ విజయం సాధించింది.

ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌లో మాట్లాడిన చిరు.. 'ఈ విజయం సమిష్టి కృషి. బాబీ సినిమా మొదలైనప్పటి నుండి సరిగ్గా నిద్రపోలేదు. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ తన మ్యూజిక్‌తో పూనకాలు తెప్పించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో మళ్లీ కలసి పనిచేయాలని ఉంది. ప్రేక్షకులకు పేరు పేరునా థాంక్స్ చెబుతున్నాం' అన్నాడు. అలాగే చిన్నపిల్లలు కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారన్న రవితేజ 'లవ్ యూ అన్నయ్య. దర్శకుడు బాబీకి బిగ్ కంగ్రాట్స్' అని చెప్పాడు. చివరగా హీరోలు ఇచ్చిన ఫ్రీడమ్‌తోనే గొప్ప విజయం సొంతమైందన్న దర్శకనిర్మాతలు తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:

చిరు మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇవ్వని ఏకైక వ్యక్తి.. ఎవరో తెలుసా?

బ్రేకింగ్: ప్రముఖ నటి పల్లవి జోషికి రోడ్డు ప్రమాదం

Advertisement

Next Story

Most Viewed