ఈ క్షణం కోసం నాలుగు దశాబ్దాలు ఎదురుచూశా: Chiranjeevi (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-12-15 06:54:26.0  )
ఈ క్షణం కోసం నాలుగు దశాబ్దాలు ఎదురుచూశా: Chiranjeevi (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా నిర్వహిస్తోన్న 53వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌-2022లో దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవి అందుకున్నారు. అవార్డుకు ఎంపికయ్యాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసినప్పుడు తన ఆనందం రెట్టింపు అయ్యిందన్నారు. ఓపిక ఉన్నంతకాలం సినిమాలు చేస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పటి యువ హీరోలు తనకు పోటీ కాదని.. తానే వాళ్లకు పోటీ ఇస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. కొనిదెల శివశంకర వరప్రసాద్‌గా ప్రారంభమైన తన సినీ జీవితం చిరంజీవి వరకు రావడానికి అభిమానులే కారణమని తెలిపారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ అవార్డు, ఈ క్షణం కోసం నాలుగు దశాబ్దాల కాలం పాటు వేచి చూశానని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సినిమాకు ప్రాంతీయ భేదాలు లేవని, ఒకటే సినిమా, అది భారతీయ సినిమా అని వ్యాఖ్యానించారు. గతంలో ఈ అవార్డు ఫంక్షన్‌కు ఒకసారి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : 'శర్మాజీ కి బేటీ' కోసం భర్త దగ్గరే అప్పుచేశా: Tahira Kashyap

Advertisement

Next Story