- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ కాళ్ల దగ్గర కూర్చున్న చిరంజీవి.. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది..
దిశ, సినిమా :మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. తన మూలాలను మరిచిపోయే మనిషి కానే కాదు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో మిడిల్ క్లాస్ వ్యక్తిలాగే తాను లైట్లు అన్నీ ఆర్పేసుకుంటూ వస్తానని.. సబ్బు వేస్ట్ చేయకుండా కొత్తదానితో కలిపే వాడుతానని చెప్పిన మాటలు ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా నెట్టింట తారసపడిన ఓ వీడియోను చూస్తే ఇంత స్టార్‌డమ్ అనుభవిస్తున్న చిరు మరీ ఇలా ఎలా డౌన్ టు ఎర్త్ ఉండగలుగుతున్నాడని అనిపిస్తుంది.
‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ లాంటి క్లాసికల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కె. విశ్వనాథ్‌కు జరిగిన ఓ సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. కానీ ఆ స్థానంలో వచ్చినట్లు కాకుండా ఓ గురువు దగ్గర శిష్యుడి మాదిరిగా ఆయన కాళ్ల దగ్గర కూర్చుని.. తనను ఈ పొజిషన్‌కు ఎదిగేలా చేసిన వ్యక్తి గురించి కొనియాడాడు. ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు.