నువ్వు ఎవడ్రా నా తమ్ముడిని అనడానికి.. చిరంజీవి ఫైర్

by sudharani |   ( Updated:2023-08-07 14:56:22.0  )
నువ్వు ఎవడ్రా నా తమ్ముడిని అనడానికి.. చిరంజీవి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి తాజా సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో తమన్న, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గరపడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే.. తాజాగా ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన బాబీ.. తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి ఏం చేశారో చెప్పుకొచ్చారు.

బాబీ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ సినిమా ఓ ఇంట్లో షూటింగ్ జరుగుంది. ఆ ఇంటి ఓనర్ ఓ పెద్ద డాక్టర్. అయితే.. లైట్ మ్యాన్స్, యూనిట్ సభ్యులు అందరూ ఆ ఇంట్లో షూస్ వేసుకుని తిరగడం చూసి వాళ్లపై సీరియస్ అవుతూ గెట్ అవుట్ అనడమే కాకుండా బూతులు తిట్టారు. అది విన్న పవన్ కళ్యాణ్ ఇంటి ఓనర్‌తో గొడవపడ్డారు. షూటింగ్‌కు డబ్బులు ఇచ్చాం కదా.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగారు. చెప్పులు లేకుండా షూటింగ్ చెయ్యాల్సిందే అంటూ ఓనర్ చెప్పడంతో.. వెంటనే పవన్ వాళ్లు చెప్పులు వేసుకోకుండా పని చేస్తే నేను ఇక్కడ షూటింగ్ చెయ్యను అంటూ వెళ్లిపోయారు. అది తెలుసుకున్న చిరంజీవి ఆ ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి.. బూతులు తిడుతూ నువ్వు ఎవడ్రా నా తమ్ముడిని బయటకు వెళ్లమనడానికి.. నువ్వు ఎంత.. నీ ఇళ్లు ఎంత..? సినిమా వాళ్లు ఎంత కష్టపడతారో నీకు తెలియదా. డబ్బులు తీసుకునే కదా ఇల్లు ఇచ్చావు. నీకు ఇంటి మీద అంత ప్రేమ ఉంటే షూటింగ్‌లకు ఇవ్వకుండా ఫ్యామిలీతో ఉండూ.. అంతే కానీ.. మా దగ్గరే డబ్బులు గుంజి మమ్మల్నే అంటే ఊరుకోను’’ అంటూ సీరియస్ అయ్యారని తెలిపారు. బాబీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story