Chiranjeevi: వరుణ్ తేజ్‌ను జంతువుతో పోల్చిన చిరంజీవి.. అల్లు అర్జున్‌ని ఏమన్నాడో తెలిస్తే షాకే

by Kavitha |   ( Updated:2024-07-28 06:46:20.0  )
Chiranjeevi: వరుణ్ తేజ్‌ను జంతువుతో పోల్చిన చిరంజీవి.. అల్లు అర్జున్‌ని ఏమన్నాడో తెలిస్తే షాకే
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 68 ఏళ్ల వయస్సులోనే సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటు సినిమాలతో అటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే గతంలో ఖైదీ నెం 150 మూవీ ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్, వివి వినాయక్ లను నిహారిక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ర్యాపిడ్ ఫైర్‌ రౌండ్‌లో చిరంజీవిని..హీరో పేరు వినగానే ఒక్క మాటలో వర్ణించాలని నిహారిక కోరింది. అలా ఫస్ట్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగా.. ఇంట్రావర్ట్ అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. తర్వాత రామ్ చరణ్ పేరు చెప్పగా.. వాడు కూడా బాబాయ్ వలె ఇంట్రావర్ట్ అని అన్నారు. ఇక వరుణ్ తేజ్ పేరు చెప్పగా.. వాడు జిరాఫీ అని అన్నాడు. అలా వరుణ్‌ని చిరంజీవి జంతువుతో పోల్చడం ఆసక్తి రేపింది. అయితే వరుణ్ హైట్‌ని ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్ చేశాడు. అనంతరం అల్లు అర్జున్ పేరు చెప్పింది నిహారిక. ప్యాక్ ఆఫ్ ఎనర్జీ.. అని అల్లు అర్జున్ గురించి చిరంజీవి ఒక్క మాటలో చెప్పేశాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story