- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ : దేశవ్యాప్తంగా ఎంతో మందికి అండగా నిలిచా.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి తన ఛారిటబుల్ ట్రస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. 1998 అక్టోబరు 2న ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ (CCT) స్థాపించి ఇప్పటికీ ఎంతోమందికి సేవలు అందిస్తున్న ఆయన.. ఈ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనివల్ల ప్రజలకు కలిగిన మేలు గురించి అభిమానులతో పంచుకున్నాడు. ‘దేశ ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. నేను ఈ ట్రస్ట్ స్థాపించిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నా. పాతికేళ్ల అద్భుతమైన జర్నీ. ఇప్పటివరకు 10 లక్షల బ్లడ్ యూనిట్లను సేకరించి బాధితులకు అందించాం.
పదివేల మందికి కంటిచూపు ప్రసాదించాం. కరోనా టైమ్‌లోనూ వేల మందికి సాయం చేశాం. తోటి మానవాళికి అండగా ఉండటం వల్ల పొందిన సంతృప్తిని మాటల్లో వర్ణించలేము. ఈ సీసీటీ వేదికగా మానవతా కార్యక్రమాల్లో భాగమై తమ వంతు సాయం చేస్తున్న వారందరికి సెల్యూట్ చేస్తున్నా. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయం ఇది. మహాత్ముడికి అర్పించే నివాళి’ అంటూ ఇన్‌స్టా వేదికగా వివరించాడు.
- Tags
- chiranjeevi