'Vaaltheru Veeraya' అంచనాలకు మించి ఉంటుంది: Chiranjeevi and Ravi Teja

by Hajipasha |   ( Updated:2022-12-28 13:22:11.0  )
Vaaltheru Veeraya అంచనాలకు మించి ఉంటుంది: Chiranjeevi and Ravi Teja
X

దిశ, సినిమా: చిరంజీవి, రవితేజ, బాబీ కలయికలో వస్తున్న మూవీ 'వాల్తేరు వీరయ్య'. శృతి హాసన్ కథానాయికగా నటించిన చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. జనవరి 13న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిరు.. సినిమా కంటెంట్ బాగుందని, కథ వినగానే బ్లాక్ బస్టర్ అవుతుందని, చెప్పానన్నాడు. అంచనాలకు మించి ఉంటుందని అన్నాడు. అలాగే అన్నయ్యతో సినిమా చేసినప్పుడు ఆ ఎగ్జయిట్‌మెంట్ వేరే ఉంటుందన్న రవితేజ.. ఈ చిత్రం ఓ పండగలా అనిపిస్తుందని చెప్పాడు. ఎన్నోసార్లు థియేటర్‌లో పూనకాలు తెప్పించిన చిరంజీవికి ఈ సినిమాను చిరు కానుక‌గా అందిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ. అలాగే నిర్మాత మాట్లాడుతూ.. చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని, చిత్రం కోసం టీమ్ అంతా కష్టపడి పని చేసినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి : స్టేజ్ పైనే Chiranjeevi సరసాలు.. ఏ Heroine తో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed