‘రంగమార్తాండ’.. బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి

by Aamani |   ( Updated:2023-03-24 12:05:20.0  )
‘రంగమార్తాండ’.. బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించగా బ్రహ్మానందం తన అద్భుత నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అయితే ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు బ్రహ్మి నటనకు ఫిదా అయ్యారట. దీంతో చిరు, చరణ్ స్వయంగా బ్రహ్మానందంను కలిసి, ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ‘శాకుంతలం’ నుంచి సమంత కొత్త పోస్టర్ రిలీజ్

Advertisement

Next Story