- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi, Balakrishna ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్!
దిశ,సినిమా: సినీ ఇండస్ట్రీలో నటీనటుల జీవితమంతా ఉరుకులు పరుగులే. ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడకు ప్రయాణం అవుతూనే ఉండాలి. దాదాపు విమానంలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. కానీ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా చాలా మందిని కొల్పోయాం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ విజయశాంతి తనకు ఎదురైన భయంకరమైన ప్రమాదం గురించి చెప్పుకొచ్చింది. ‘1993 నవంబర్ 15న ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. ఓ రోజు దీపావళి పండుగ కోసం అందరం ఇంటికి బయలుదేరాం. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానం.. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన 64 మంది సినీ ప్రముఖులున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, సుధాకర్, దర్శకుడు బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి ఉన్నారు.
అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ వాతావరణం సహకరించకపోవడంతో గాలిలోనే తిరిగుతూ చక్కర్లు కొడుతుంది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తడిగా ఉన్న పంట పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన ఫ్లైట్ ముందు ఓ పెద్ద బండ రాయి ఉంది. మరి కాస్త ముందుకు వెళితే చెరువు ఉంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు’ అని చెప్పుకొచ్చింది విజయశాంతి. ఇక అప్పట్లో ఈ సంఘటన చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందట.