దుమారం రేపుతున్న చిన్మయి పోస్ట్‌.. నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో క్లారిటీ ఇస్తూ సెన్సేషనల్ కామెంట్స్

by Hamsa |
దుమారం రేపుతున్న చిన్మయి పోస్ట్‌.. నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో క్లారిటీ ఇస్తూ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ చిన్మయి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై రియాక్ట్ అవుతుంది. పలు సంఘటనలపై తనదైన శైలిలో పోస్టులతో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా, చిన్మయి తన భర్త రాహుల్, కూతురు ప్రవర్తనపై ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ కొద్ది రోజుల క్రితం నా రెండేళ్ల కూతుర్ని నా భర్త రాహుల్ హగ్ చేసుకోబోయాడు. కానీ తను వెంటనే నో అని చెప్పింది. దీంతో నేను వెంటనే రాహుల్ నేను నిన్ను హగ్ చేసుకోమని బలవంత పెట్టడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అని నువ్వు గుర్తుంచుకో అని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ నా కూతురిని హగ్ చేసుకోవడానికి దగ్గరకు పోలేదు. అలా అని నేను నా కూతురిని కూడా బలవంతంగా ఒప్పించలేను. నాన్నను హగ్ చేసుకోమని చెప్పలేను. నేను కూడా ఫాలో అవుతాను. ఆరేళ్ల వయసు ఉన్న అమ్మాయి బుగ్గ గిల్లాలన్నా, టచ్ చేయాలన్నా సరే ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాను’’ అని రాసుకొచ్చింది.

ఇక చిన్మయి చేసిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. అది చూసిన నెటిజన్లు తండ్రీ కూతురు బంధాన్ని తప్పు పడుతున్నావని ఆమె పై ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా పలు పోస్టులతో చిన్మయి తీరుపై దారుణంగా కామెంట్స్ చేశారు. ఇక అవన్నీ తట్టుకోలేని ఆమె ఇన్‌స్టా వేదికగా రియాక్ట్ అయింది. ‘‘తండ్రి కూతుళ్ళ బంధం చాలా పవిత్రమైనది. కానీ మీరు దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వెతుకుతూ నన్ను విమర్శిస్తున్నారు. అసలు నేను రాహుల్‌కి చెప్పి చేయించలేదు. తనంతట తానే చేశాడు. తర్వాత నా కూతురికి కూడా అతనే చెప్పాడు. రాహుల్ అలా చేయడం వల్ల తనపై నాకు గౌరవం పెరిగింది. అతను గొప్ప ఆల్ఫా మేల్, మీలాంటి షీట్ కాదు. కొందరు మీమ్ బాయ్స్ ఎప్పుడు నాతో రాహుల్ ఎలా ఉంటున్నాడు. టార్చర్ అనుభవిస్తున్నాడు. ఇది వదిలేసి డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో మావా అని వాగుతూ అరుస్తూ కూర్చుంటారు. వాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ మేము మా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాము’’ అని వీడియో రిలీజ్ చేసింది.

అలాగే మరో పోస్ట్‌లో ‘‘నా కూతురు అన్నావా అయితే రాహుల్‌కు నాకు పుట్టింది కాదా. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిందని నానా మాటలు అంటున్నారు. ఇదే నా వీల్ల కల్చర్ తల్లదండ్రుల పెంపకం. ఇలాంటి మాటలు వాళ్ళ ఇంటి కల్చర్. ఇంత దారుణంగా మాట్లాడటం ఏంటి. మీరు తెలుసుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు మీరే డెసిషన్ తీసుకోవాలి. అయితే నేను ఆఫీసు నుండి వచ్చాక నా కూతురిని నా దగ్గరికి వస్తావా అని అడిగితే తను నో అంటే నేను అసలు ముట్టుకోను. దీంతో నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నా కూతురు, కొడుకు వచ్చి నన్ను కలుస్తారు’’ అని చెప్పుకొచ్చింది. దీనిపై కూడా కొందరు ఫైర్ అవుతున్నారు. ఇక చిన్మయి పోస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా రియాక్ట్ అయింది. ‘‘ ఖచ్చితంగా ఇది రాహుల్ చేసి తీరతాడు’’ అని కామెంట్ పెట్టింది.

(Video Link Credits to chinmayisripaada Instagram Channel)

Advertisement

Next Story