సినిమా షూటింగ్‌లో మేకప్ ఆర్టిస్ట్ పై చిరుత దాడి..

by Mahesh |   ( Updated:2023-02-18 03:01:15.0  )
సినిమా షూటింగ్‌లో మేకప్ ఆర్టిస్ట్ పై చిరుత దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్.. హీరోలు నటిస్తున్న బడే మియన్ చోటే మియన్.. చిత్రంలో అపశృతి చోటు చేసుకుంది. ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మపై చిరుత పులి దాడి చేసింది. అతను తన స్నేహితుడిని బైక్ పై డ్రాప్ చేయడానికి వెళ్లి వస్తుండగా.. అతనిపై పులి దాడి చేసినట్లు తెలుస్తుంది. కాగా పులి దాడిలో గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ అయినా అతనికి ప్రొడక్షన్ హౌస్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story