బిజినెస్ లీడర్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసనకు చోటు!

by sudharani |   ( Updated:2023-03-25 11:53:14.0  )
బిజినెస్ లీడర్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసనకు చోటు!
X

దిశ, సినిమా: రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు అపోలో వైస్ చైర్ పర్సన్‌గా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అయితే తాజాగా చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంతో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా మరొక ఘనత సాధించింది. ఆమె మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ ఆసియా 2022-23 జాబితాలో ఒకరిగా నిలిచింది. దీంతో ఉపాసన చేసిన సేవలకుగాను అవార్డు లభించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఉపాసన.. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Next Story