- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో చరణ్‌కు అవమానం జరగలే.. వీడియోతో క్లారిటీ
దిశ, సినిమా : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా అతి మహారథుల మధ్య ఈ వేడుకలు జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఎందరో సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సందడి చేసిన విషయం తెలసిందే.ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ రామ్ చరణ్‌ని అవమానించారు అంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, దీనిపై షారుఖాన్ ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు.
అయితే అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ స్టేజ్ పై షారుఖ్, అమీర్, సల్మాన్ నాటు నాటు పాటకు డాన్స్ చేశారు.అయితే వీరు నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసే క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్ మ్యాచ్ చేయాలని చూసినా అది కుదరకపోవడంతో షారుఖ్,రామ్ చరణ్ ను స్టేజ్ పైకి రావాలని పిలిచిన సమయంలో,ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ సంబోధించారు.దీంతో మెగా ఫ్యాన్స్ బాలీవుడ్ బాద్ షా పై తెగ ఫైర్ అయిపోయారు. షారుఖాన్ ప్రవర్తన ఇలా ఉంటదని అస్సలు ఊహించలేదంటూ మండిపడుతున్నారు. దీంతో షారుఖ్ ఫ్యాన్స్, రామ్ చరణ్‌ను షారు అవమానపరచలేదంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో ‘వన్ 2 కా 4’. ఈ మూవీలో ఇడ్లీ, వడ, సూపర్ స్టార్ రజినీకాంత్ అనే డైలాగ్ చాలా ఫేమస్, ఆ ఉద్దేశ్యంగానే షారుఖ్ రామ్ చరణ్‌ను పిలిచారు తప్ప అందులో అవమానపరిచే అంశం ఏదీ లేదంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
- Tags
- Ram Charan