నాగ చైతన్య కొత్త ఇంటికి వచ్చిన మొదటి అతిథి.. ఎవరో తెలుసా?

by Aamani |   ( Updated:2023-03-23 11:11:04.0  )
నాగ చైతన్య కొత్త ఇంటికి వచ్చిన మొదటి అతిథి.. ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవల నూతన గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉగాది పండుగ సందర్భంగా చైతన్య ఇంటికి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. అతనెవరో కాదు దర్శకుడు చందూ మొండేటి. పండుగ వేళ చందూ మొండేటిని తన కొత్త ఇంటికి ఆహ్వానించారు నాగ చైతన్య. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన చందూ. ‘నాగ చైతన్య కొత్త ఇంటికి వెళ్లడం జరిగింది. నేనే మొదటి గెస్ట్. ఇందుకుగానూ నాగ చైతన్యకు ధన్యవాదాలు’ అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను నెట్టింట షేర్ చేశాడు.

Advertisement

Next Story