- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలయ్యతో నటించే అవకాశం రావడం నా అదృష్టమే: Chandrika Ravi
దిశ, సినిమా: బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం 'వీర సింహారెడ్డి'. 2023 జనవరి 12న విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. కాగా ఇటీవల రిలీజైన 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అనే పాటలో బాలయ్యతో కలిసి ఊర్రూతలూగించిన చంద్రిక రవి.. రీసెంట్ ఇంటరాక్షన్‌లో ఆసక్తికర విషయాలు చెప్పింది. 'బాలయ్యతో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇలాంటి చాన్స్ జీవితంలో ఒక్క సారే వస్తుంది. పాట బ్లాక్ బస్టర్ అయినందుకు ఆనందంగా ఉంది. చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ నేర్పించిన పేరెంట్స్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ సౌత్ ఇండియన్ కల్చర్ మా ఫ్యామిలీలో అంతర్భాగమే. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ జ్ఞాపకాలని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. సాంగ్ రెస్పాన్స్ చూస్తే కష్టానికి తగిన ఫలితం దక్కిందనిపించింది. బాలయ్యగారు అద్భుతమైన డ్యాన్సర్' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తమిళ సినిమాలతోపాటు మరో తెలుగు మూవీలో నటించేందుకు డిస్కషన్ నడుస్తుందన్న ఆమె.. యూఎస్‌లోనూ కొన్ని షోలు ప్లానింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
READ MORE
అందరూ దాన్ని ఆకు అనే అనుకున్నారు.. కానీ తీరా చూస్తే..!
'నువ్వే నా ప్రాణం'.. ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్