‘చంద్రముఖి-2’ ట్విట్టర్ రివ్యూ.. లారెన్స్, కంగనా ప్రేక్షకులను భయపెట్టారా?

by Hamsa |   ( Updated:2023-10-03 12:32:24.0  )
‘చంద్రముఖి-2’ ట్విట్టర్ రివ్యూ.. లారెన్స్, కంగనా ప్రేక్షకులను భయపెట్టారా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన ‘చంద్రముఖి’ బాక్సాఫీసు వద్ద ఓ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 18 ఏళ్లు అయ్యాయి. ఇన్ని ఏళ్ల తర్వాత తాజాగా, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, కంగనా హీరోయిన్‌గా చంద్రముఖి-2ను డైరెక్టర్ పి వాసు తెరకెక్కించారు. ఈ మూవీ నేడు సెప్టెంబర్ 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది.

దీంతో ఈ సినిమాను చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ బాగుందని అంటున్నారు. అలాగే స్క్రీన్ ప్లే, లారెన్స్, కంగనా నటన ఎంతో ఆకట్టుకుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొందరు చంద్రముఖి-2కి 3/5 రేటింగ్ ఇస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం సెకండ్ షో చూశాక ఇంటికి వెళ్లాలంటే భయంతో తడిపోవాలని పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story