Niharika Konidela : నిహారికతో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన చైతన్య.

by Prasanna |   ( Updated:2023-07-05 07:45:00.0  )
Niharika Konidela : నిహారికతో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన చైతన్య.
X

దిశ, సినిమా: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక విడాకుల ఇష్యూపై మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. నిహారిక తన భర్తతో విడిపోవడం నిజమేనని అధికారిక సమాచారం బయటకు వచ్చింది. వీరి డైవోర్స్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. దీంతో భర్త చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు నిహారిక ఇన్ స్టాలో అధికారికంగా ప్రకటించింది. ఇక సేమ్ టూ సేమ్ చైతన్య కూడా ‘నిహారిక, నేను పరస్పరం విడిపోయాము, మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు. నేను నార్మల్‌ అవ్వడానికి కొంత గోప్యంగా ఉండాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని చైతన్య కూడా ఇన్ స్టా లో ప్రకటించారు.

Advertisement

Next Story