Niharika Divorce: చైతన్య, నిహారికలకు విడాకులు.. తేలేది నేడే

by Mahesh |   ( Updated:2023-07-05 03:06:27.0  )
Niharika Divorce: చైతన్య, నిహారికలకు విడాకులు.. తేలేది నేడే
X

దిశ, వెబ్‌డెస్క్: నిహారిక, చైతన్యలు మధ్య గొడవలు జరుగుతున్నాయని.. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ గత రెండు రోజులుగా వారి విడాకులకు సంబంధించిన పిటిషన్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నిహారిక, చైతన్యల విడాకులు కాంట్రవర్సీకి మరింత ఆజ్యం పోసినట్లయింది. కాగా ఎట్టకేలకు వీరిద్దరూ విడాకులు వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. విడాకుల కోసం కూకట్ పల్లీ ఫ్యామిలీ కోర్టులో 2023 ఏప్రిల్ 1న వీరిద్దరు దరఖాస్తు చేసుకోగా.. 2023 జూన్ 5న వారికి విడాకులు మంజూరు అయ్యాయి. కాగా ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. వీరిద్దరి పెళ్లి 2020 జూన్ లో అంగరంగవైభవంగా జరిగింది.

Also Read: పెళ్లి ఎన్ని రకాలు.. ఏ వివాహం దేనికి సంకేతం..?

Advertisement

Next Story