- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెలబ్రిటీలు డబ్బులు కోసమే అలాంటి పనులు చేస్తారు.. బిగ్‌బాస్ వాసంతి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్‌ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. లక్ష పెడితే.. పది లక్షలు మీరు సొంతం చేసుకోవచ్చంటూ కొందరు ఎరగా వేస్తున్నారు. దీంతో చాలా మంది వారి ఉచ్చులో పడిపోయి లక్షల కొద్ది డబ్బులు పోగొట్టుకుని మోసపోతున్నారు. కొందరు ఉన్నదంతా కోల్పోయి ఇంట్లో వారికి చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా యాంకర్స్, బుల్లితెర స్టార్స్, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అరియానా, శ్రీముఖి అషురెడ్డి, వాసంతి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.
వీరు అలా చేయడం వల్ల కొంతమంది తెలియక డబ్బులు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి స్పందించింది. ‘‘హలో ఫ్యామిలీ.. నేను బెట్టింగ్, ట్రేడింగ్ ప్రమోషన్స్ ఏం చేసినా అవి పెయిడ్ కాబట్టి చేస్తున్నాను. నాతో చాలా మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారంటే కేవలం డబ్బుల కోసమే. మీకు ఇష్టమైతేనే మీరు డబ్బులు పెట్టండి లేదంటే లేదు. అంతేకానీ మమ్మల్ని మాటలు అనడం ఏంటి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి మేల్కొండి’’ అని తన ఇన్‌స్టాస్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
Read More..
ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అలా చేస్తున్న సమంత షాకింగ్ పోస్ట్ వైరల్.. కారణం అదేనా?